IND 252/9: ఇండియాకి తప్పిన ఫాలో ఆన్ గండం 5 d ago
చివరి వికెట్ మిగిలి ఉండగా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది టీమిండియా. బ్రిస్బేన్ టెస్టులో నాలుగవ రోజు పలుమార్లు వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగినా, ఆట ముగిసే సమయానికి ఇండియా 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. పదో వికెట్‌కు బుమ్రా, ఆకాశ్‌లు 39 రన్స్ జోడించి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బుమ్రా 10, ఆకాశ్ దీప్ 27 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా 193 రన్స్ వెనుకబడి ఉంది భారత్. రేపు అయిదో రోజు ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించే అవకాశాలు ఉన్నాయి.